


ఇన్చార్జి మంత్రి అచ్చన్నాయుడు, ఎమ్మెల్యే విజయ్ చంద్ర.
పార్వతీపురం : కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో పార్వతీపురం జిల్లా అన్ని రంగాల గణనీయమైన అభివృద్ధి సాధించిందని ఇన్చార్జి మంత్రి కింజరపు అచ్చన్నాయుడు, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ప్రజలకు అవసరమైన అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజా జకపాలనందిస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేషికత్వంలో నిరంతరం ప్రజలతో కలిసి ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. పింఛన్ తల్లికి వందనం గ్యాస్ సహా ఎన్నో పథకాలను ప్రజలకు అందించామని కూటమి పాలనలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
