
గరుడ న్యూస్, సాలూరు
దేశంలో కార్మిక హక్కులుగా ఉన్న చట్టాలు రక్షించుకోవడం కోసం జూలై 9 జరుగుతున్న సమ్మె జయ ప్రధానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉందని సిఐటియు తెలిపింది.
జీపు యాత్ర బృందం సాలూరు పట్నానికి చేరుకున్న సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి బోసుబం వరకు ర్యాలీ జరిగింది.
బోసు బొమ్మ వద్ద సిఐటియు పట్టణ నాయకులు టి శంకర్రావు అధ్యక్షతన సభలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారావు మన్మధరావు మరియు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు మాట్లాడారు.
దేశంలో కార్మికులకు నష్టం చేసే లేబర్ కోట్లు మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్కీం వర్కర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేయకుండా వేతనాలు పెంచాలని సంక్షేమ పథకాల అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో ప్రైవేటీకరణ విధానాలు ఆపి ప్రభుత్వం కాపాడేలా నిర్ణయాలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతులు వ్యవసాయ కూలీలు కు కనీస కూలి అమలు చేసి పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
జరిగిపోతున్న ధరలపై అదుపు చేసే విధంగా చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలు అమలు చేసి కార్మికు న్యాయం చేయాలని లేకుంటే జూలై 9న పెద్ద ఎత్తున్న కార్మిక వర్గాన్ని కదిలించి సమీక్ష పడతామని తెలిపారు.
కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఇందిరా జ్యోతి రాము సాలూరు పట్టణ నాయకులు రాముడు స్వప్న లక్ష్మి అబద్ధం పెద్ద ఎత్తున వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

