ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలివిద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి*

Sesha Ratnam
2 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,జూన్28,(గరుడ న్యూస్):

మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యా బోధన, మౌలిక సదుపాయాలు,విద్యార్థుల ఎన్రోల్మెంట్,ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య,మండలాల వారీగా ఉన్న పాఠశాలలు వాటిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య,వివిధ పాఠశాలల మధ్య దూరం,ఎక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు ఎన్ని,తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు ఎన్ని,ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గడానికి కారణాలు ఏంటి,అనే ఇత్యాది అంశాల పై నల్గొండ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారులతో మునుగోడు లోని క్యాంపు కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.మండలాల వారీగా ప్రాథమిక,ప్రాథమికొన్నత,ఉన్నత పాఠశాలల పనితీరు,వసతుల పై సుదీర్ఘంగా చర్చించారు.ప్రభుత్వ బడుల్లో విద్యాప్రమాణాలు పెంచడానికి ఎటువంటి మౌలిక సదుపాయాల ను అభివృద్ధి చేసుకోవాలనే విషయం పై ఈ సమావేశం లో ప్రణాళికలు రూపొందించారు.ప్రణాళిక ప్రకారం ప్రతి మండలంలో ఐదు నుండి ఆరు పాఠశాలలను క్లస్టర్ పాఠశాలలుగా  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించారు.మునుగోడు మండలంలో 5,చండూరు మండలంలో 5,గట్టుప్పల్ మండలంలో 4,నాంపల్లి మండలంలో 6,చౌటుప్పల్  మండలంలో 12,నారాయణపూర్ మండలం లో 7 స్కూళ్లను  కలుపుకొని మొత్తం 43 క్లస్టర్ పాఠశాలలను  
అత్యాధునిక   మౌలిక వసతులతో  అభివృద్ధి చేసుకుంటే 20,000 మంది విద్యార్థిని విద్యార్థులకు  కార్పొరేట్ స్థాయి  విద్యను అందించవచ్చని  వీటి అభివృద్ధికి గాను 285 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రణాళికలు  రూపొందించారు.ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా 330 పాఠశాలల్లో 9, 900 మంది విద్యార్థులు చదువుతున్నారని,ఈ 43 క్లస్టర్ పాఠశాలల ను అభివృద్ధి చేసుకున్నట్లయితే 20వేల మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో  నాణ్యమైన విద్యను అందించవచ్చని పేర్కొన్నారు.ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా  క్లస్టర్ స్కూళ్ళ ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ డీఈవో బిక్షపతి,యాదాద్రి భువనగిరి జిల్లా డీఈవో  సత్యనారాయణ,మునుగోడు చండూరు,నాంపల్లి,గట్టుప్పల్, మర్రిగూడెం నారాయణపురం చౌటుప్పల్,మండలాల ఎంఈఓ,లు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *