
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,జూన్28,(గరుడ న్యూస్):
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,సహకారంతో కొయ్యలగూడెం వాస్తవ్యురాలు గంజి శివజ్యోతి ,కి 51,000/- యాభై ఒక్క వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్ చేతుల మీదుగా లక్కారం,కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది.ఈ వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిది అని, ప్రజా పాలనలో పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి అభివృద్ధికి కార్యాచరణతో ముందుకు వెళుతుందని తెలియజేశారు.కార్యక్రమంలో కాంగ్రెస్ చౌటుప్పల్ మండలం అధ్యక్షులు బోయ దేవేందర్,చౌటుప్పల్ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్,కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భార్గవ్,కొయ్యలగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రగుంట వెంకటేశం,కొయ్యలగూడెం కాంగ్రెస్ కన్వీనర్ మాచర్ల సంతోష్ కుమార్,ఎర్రగుంట నరసింహ,ఏల మురళి,పొట్ట బత్తిని పురుషోత్తం,తదితరులు,పాల్గొన్నారు.

