ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలిహెల్త్ రివ్యూ లో  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

Sesha Ratnam
2 Min Read

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,జూన్27,(గరుడ న్యూస్):

ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించే విధంగా ప్రభుత్వ డాక్టర్లు  ఆసుపత్రి సిబ్బంది బాధ్యతతో పని చేయాలన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.మునుగోడు క్యాంపు కార్యాలయంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న హెల్త్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం పేద ప్రజలకు సర్వీస్ చేయడానికే ఉన్నదని ప్రభుత్వానికి విద్య,వైద్యం అనేవి రెండు కళ్ళ లాంటివని ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల ద్వారా  ప్రజల వైద్యంపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రిలు ప్రజల జేబులు లూటీ చేస్తున్నాయన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందుతుందని బాగా చూస్తారని  ప్రజల్లో నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు సిబ్బంది పనిచేయాలన్నారు.ఇటీవల కాలంలో ప్రజలపై వైద్యభారం ఎక్కువగా పడుతుందని దానిని తగ్గించాల్సిన బాధ్యత,ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించే బాధ్యత ప్రభుత్వ డాక్టర్లు సిబ్బందిపై ఉందన్నారు.ప్రతినెల వైద్య శాఖ పై సమీక్ష నిర్వహిస్తానని  వచ్చే నెల నిర్వహించే సమీక్షలో పని విధానం పై మార్పు రావాలన్నారు.చౌటుప్పల్  పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో  డాక్టర్లు,సిబ్బంది పేషంట్ల పై  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ట్రీట్మెంట్,చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి స్థానిక నాయకులు తీసుకురాగా వెంటనే యాదాద్రి జిల్లా డిసిహెచ్ఎస్,చిన్న నాయక్,కు ఫోన్ చేసి  ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ ఒక్క పేషంటును కూడా ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేయూద్దన్నారు.మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు.ప్రజా వైద్యం విషయంలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ వైద్యాధికారులు కలిసి టీం వర్క్ గా పని చేయాలని,మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాదని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే బాధ్యత మీదన్నారు.ఈ సమీక్ష సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ ఓ,మనోహర్,నల్గొండ డిప్యూటీ డిఎంహెచ్వో,వేణుగోపాల్ రెడ్డి,దేవరకొండ ఇన్చార్జి డిప్యూటీ డి ఎంహెచ్ ఓ,కళ్యాన్ చక్రవర్తి,చౌటుప్పల్ డిప్యూటీ డిఎంహెచ్వో యశోద,వివిధ మండలాల మెడికల్ ఆఫీసర్లు,ఎమ్ ఎల్ హెచ్పిఎస్ లు,వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *