తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): పాకాల మురళి: డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కోసం, ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు రేణిగుంట డిఎస్పి శ్రీనివాస రావు. మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలవల్ల ,జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ,రేణిగుంట పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో, మాదకద్రవ్యాల నివారణ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో స్వచ్చంద సంస్థలు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు
అనంతరం మానవహారంగా ఏర్పడి మత్తుపదార్థాల, వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, చెడు స్నేహాల వల్ల మత్తుకు యువత బానిసలవుతున్నారని అన్నారు. గంజాయి సహా మత్తు పదార్థాలు అనేక రుగ్మతలకు, అనేక నేరాలకు కారణమవుతున్నాయని. మత్తు పదార్థాలు వినియోగించే వారి పైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రేణిగుంట డిఎస్పి.