

జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా భాస్కరరావు పర్యవేక్షణ లో జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కంటి వెలుగు కార్య క్రమం లో బాగంగా గుమ్మలక్మీపురం,కురుపాం మండలంలో వున్న సచివాలయంల పరిధిలో వున్న గ్రామాలలో నిర్వహించిన నేత్ర వైద్య శిభిరం లలో చేసిన నేత్ర పరీక్షలలో కేటరాక్ట్(అంతర కుసుమం) టేరిజియం(కొయ్యకండ) వున్న వారిని గుర్తించి వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు కోసం శుక్రవారం కురుపాం సామజిక ఆరోగ్య కేంద్రం నుండి పుష్ప గిరి కంటి ఆసుపత్రి విజయ నగరం కి తరలించి శనివారం శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని మన్యం జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి తెలిపారు.వీరందరికీ ఉచిత రవాణా,వసతి, భోజనం, కళ్ళ జొల్లు,మందులు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. శస్త్ర చికిత్సలు కు వెళుతున్న రోగులకు పలు సూచనలు,జాగ్రతలు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా మా లాంటి పేదలకు కంటి చూపును తెప్పించే బాధ్యత జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ తీసుకొని అన్ని సదుపాయాలు కల్పిస్తున్న జిల్లా అంధత్వ నివారణ సంస్థ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆరోగ్యమిత్ర మరియు ఆషా కార్య కర్తలు పాల్గొన్నారు.
