సేవాలాల్ సేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాలోత్ సురేష్ నాయక్
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 28 గరుడ న్యూస్
హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభ జరిగింది ఈ సందర్భంగా సేవాలాల్ సేన రాష్ట్ర నూతన కమిటీ నియామకంలో మానుకోట జిల్లా కురవి మండలం రాజోలు గ్రామం బాలుతంండా కు మాలోత్ సురేష్ నాయక్ ను సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు, ఈ పదవిలో సురేష్ నాయక్ రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమాకానికి సహకరించిన జాతీయ కమిటీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ., ఈ రాష్ట్రంలో గిరిజన లంబాడీల సమస్యల కోసం పోరాడుతానని, రాజకీయంగా ఆర్థికంగా, సామాజికంగా లంబాడాలకు అన్యాయం జరుగుతుందని వాటిని చూస్తూ సహించేది లేదని త్వరలోనే వాటిపై పోరాటం మొదలుపెడతానన్నారు. లంబాడీల పండుగలు, భాష, సాంప్రదాయం చాలా గొప్పవైనవని వాటిని పరిరక్షించే దిశగా జాతిని బిడ్డలను జాగ్రృతి పరిచి చైతన్య దిశగా నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ రాష్ట్రంలో లంబాడీలను ST రిజర్వేషన్ నుండి తొలగించే ప్రయత్నం కుట్ర జరుగుతంది.
లంబాడీల పట్ల అలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే సేవాలాల్ సేన చూస్తూ ఊరుకోదని రాష్ట్రంలో గిరిజన లంబాడా తండాల్లోని ప్రతి బిడ్డను జాగ్రృతి పరిచి ఈ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఉద్యమం సేవాలాల్ సేన చేస్తుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గంలో లంబాడీలకు చోటు కల్పించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించాలన్న తిరిగి అదే గద్దె దించాలన్న అది లంబాడీల వల్లే సాధ్యమనే విషయాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు గుర్తు పెట్టుకోవాలి అని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా నూతన సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.




