జాతీయ స్థాయి ఉర్సు పోటీలకు మహబూబాబాద్ మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక….
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 28 (గరుడ న్యూస్)
ఇటీవల సిరిసిల్లలో జరిగిన జూనియర్ రాష్ట్రస్థాయి ఉరుసు పోటీలలో మహబూబాబాద్ లోని అనంతారం ఆదర్శ పాఠశాల విద్యార్థి శ్రీ చరణ్ అత్యంత ప్రతిభ కనబరిచి హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు అని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు తెలిపారు. అదేవిధంగా హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో విద్యార్థిని నవ్ సీన్ బంగారు పతాకం సాధించింది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలలో పాఠశాల విద్యార్థి బి. విష్ణు ప్రతిభ కనబరిచి వరంగల్ లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు అని ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు పిడి. కే.ఎస్. వర్మ తెలిపారు. వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ఉపేందర్ రావు తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.



