


జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐ.పి.ఎస్ జూమ్ వీడియో కాన్ఫరెన్సు(వర్చువల్ విధానంలో) లో నెలవారీ నేర సమీక్షా సమావేశము నిర్వహించి పెండింగ్ లో ఉన్న గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, 174 CrPC కేసులు, మిస్సింగ్, గంజాయి,రోడ్డుప్రమదాల కేసులు మరియు శాంతిభద్రతల పరిరక్షణ చర్యలు, నాన్ బైలబుల్ వారెంట్లు మొదలగు విషయాలపై జిల్లా పోలీస్ అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించి తగిన సూచనలు, సలహాలు, మెలకువలను చేశారు. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ కేసులను స్టేషన్ల వారీగా సమీక్షించారు.
గ్రేవ్ కేసులను పోలీస్ స్టేషన్ల వారిగా సమీక్షించి, పెండింగ్ కి గల కారణాలు అడిగి తెలుసుకొని వాటికీ తగ్గ సూచనలు, సలహాలు, మెలకువలను చేశారు. లాంగ్ పెండింగ్ కేసులు/NDPS కేసులు త్వరితగతిన పరిష్కరించి దర్యాప్తు పూర్తిచేసి ఛార్జ్ షీట్స్ కోర్ట్ కి సమర్పించి SC/CC నెంబర్లు పొందాలి. ప్రతి కేసులో కీలక ఆధారాలను గమనించి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కేసును త్వరితగతిన చేధించండి. ఈ -చలాన, డ్రంక్ & డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదుచేయాలని ఆదేశాలు జారీచేసారు. నాటుసారా, గంజాయి రవాణా, అమ్మకం చేసే వారి మీద దాడులు నిర్వహించి కేసులు నమోదుచేయాలి. ఆస్తి సంభందిత నేరాల కేసులు సమీక్షించి త్వరితగతిన పరిష్కరించి, భాదితులకు న్యాయం చేయాలి.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, రోడ్ భద్రతా నియమాలపై వినూత్న రీతిలో అవగాహన కల్పించి, వాహన తనికీలు విరివిగా చేస్తూ రోడ్డ్ ప్రమాదాలను నివారించేలా చర్యలు చేపట్టాలి.
గంజాయి కేసులలోని పరారీలో ఉన్న ముద్దాయిలను అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలి, పెండింగ్లో ఉన్న NBW అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
FSL/REL రిపోర్ట్స్ వేగరంగా పొంది కేసులను పరిష్కరించాలి.
పేకాట,ఓపెన్ డ్రింకింగ్, గంజాయి సేవించే స్తావరాలు వంటి అసాంఘిక కార్యక్రమాలు నిలవరించడానికి డ్రోన్ సహయంతో ప్రతీరోజు డ్రోన్ పోలీసింగ్ నిర్వహించాలి. IT కేసులు/సోషల్ మీడియా కేసుల మీద ప్రత్యెక ద్రుష్టి సారించి వాటి దర్యాప్తు పూర్తిచేసి ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయాలి.
సమావేశాలు/ర్యాలీలు/ఊరేగింపులు/ప్రదర్శనలు/ధర్నాలు నిర్వహించడానికి నిరభ్యంతర ధృవీకరణ పత్రం/అనుమతి పత్రం సంబంధిత పోలీస్ అధికారులనుండి తప్పక పొందాలి.
హెల్మెట్ ధారణ మీద ప్రజలకు అవగాహనా కలిపించి, M.V. నిభందనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చెయ్యాలన్నారు.
లోక్ అదాలత్ లో రాజీ అయ్యే కేసులని,ఇరువర్గాల వారితో మాట్లాడి వారికీ అదాలత్ గురించి వివరించి వీలైనంత వరకు ఎక్కువ కేసులు లోక్ అదాలత్ లో రాజీ అయ్యేలా చూడాలని ఆదేశాలు జరిచేసారు..
సైబర్ నేరాల మీద, మహిళా సంభదిత నేరాల మీద, శక్తి యాప్, మత్తుపదార్దల వినియోగం వాళ్ళ కలిగే అనర్దాలు గురుండి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేసారు.
ఈ నేర సమీక్ష సమావేశం లో గౌరవ ట్రైనింగ్ IG శ్రీ కె.వి.మోహన్ రావు వీడియో కాన్ఫిరెన్స్ (వర్చ్యువల్) లో మాట్లాడుతూ..
పార్వతీపురం జిల్లా పరిధి లో ఉన్న కాలేజీలలో విద్యార్దులు ర్యాగింగ్ కు పాల్పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు జరపాలి, పోక్సో, SC & ST కేసులలో మహిళలపై దాడులు జగకుండా తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలి. సైబర్ నేరాల మీద, మహిళా సంభదిత నేరాల మీద, శక్తి యాప్, మత్తుపదార్దల వినియోగం వాళ్ళ కలిగే అనర్దాలు గురుండి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేసారు.
ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్సు లో జిల్లా ఎస్పీ తో పాటుగా పాలకొండ డిఎస్పీ రాంబాబు, డిసిఆర్బి సిఐ ఆదాం, సోషల్ మీడియా,సైబర్ సెల్ సిఐ శ్రీనివాసరావు, CCS సిఐ అప్పారావు, ఎస్బీ సిఐ రంగనాధం మరియు జిల్లా సిఐ లు, ఎస్సై లు ఇతర అధికారులు పాల్గొన్నారు..
