రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,జూన్29,(గరుడ న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని చిన్న కొండూరు గ్రామానికి చెందిన,కానుకుర్తి నర్మద,శంకర్ల చిన్న కుమారుడు కానుకుర్తి శివకుమార్ కి ఉస్మానియా విశ్వవిద్యాలయం రాజనీతిశాస్త్ర విభాగంలో తన పరిశోధనకు గాను పి.హెచ్ డి పరిశోధన పట్టాను ప్రధానం చేసింది.శివకుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్
డా.యాస్మిన్ పర్యవేక్షణలో
సైబర్ క్రైమ్ ఇన్ ఇండియా అనే అంశంపై తన పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు శివకుమార్.తన విద్యాభ్యాసాన్ని పదవతరగతి వరకు చౌటుప్పల్ మండల కేంద్రంలోని విశాల భారతి పాఠశాలలో,ఇంటర్ మాతృశ్రీ కళాశాలలో,డిగ్రీ నలంద కళాశాలలో పి జి.పొలిటికల్ సైన్స్,ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు.శివకుమార్ తన పరిశోధన ప్రక్రియ క్రమంలో రాసిన పరిశోధన పత్రాలు యు జి సి.గుర్తింపు పొందిన జాతీయ,అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి.ప్రస్తుతం శివకుమార్ కు పీహెచ్డీ.పట్టా రావడం పట్ల
పలువురు అధ్యాపకులు,ఆత్మీయ బంధుమిత్రులు,శ్రేయోభిలాషులు అభినందిస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు.