
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, జూన్28,(గరుడ న్యూస్):
హైదరాబాదులోని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల భారతీయ న్యాయవాద సంఘటన మంచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కురుమ,పాల్గొని మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో టిఎస్సి కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసి పథకాలు అందడంలో లోపాలు ఉంటే మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రజాసేయస్సు కోసం పని చేయాలన్నారు.సంస్థన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన స్థానికుడు ఈసం రామకృష్ణ ని నారాయణపురం మండల టి ఎస్ సి వి అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈసం రామకృష్ణ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు మండల అధ్యక్షుడు బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నర్రి స్వామి,కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో సంస్థ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య నాయకులు కొర్ర సాగర్ నాయక్,శంకర్ కురుమ,కట్టెల గణేష్ ,సింగం కృష్ణ,దువ్వ నవీన్,ఉప్పలపల్లి బాలకృష్ణ, మీడియా కోఆర్డినేటర్,నరసింహ,గణేష్,అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

