

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి: ఆర్. మంజునాథ్: తేది: 28.06.2025: కర్ణాటక రాష్ట్ర న్యాయశాఖామత్యులు శ్రీ. హెచ్. కె. పాటిల్ గారు వారి సిబ్బందితో ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని 28.06.2025 మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా వారు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య యం. దొరస్వామిగారు, కులసచివులు ఆచార్య కిరణ్ కుమార్ గారు, ఆచార్య యం.ఎన్. వెంకటేష్ గారు, ఆచార్య కె. శారద గారు, ఆచార్య జయలలితగారు, ఆచార్య బి. శివకుమార్ గారు, ఆచార్య శ్రవణ కుమార్ గారు, డాక్టర్. దుర్గాప్రవీణ్ గారు, డాక్టర్ మల్లేషప్పగారు, ఆచార్య శ్రీనివాస్ కుమార్ గారు విశ్వవిద్యాలయ పురోగతి భాషాభివృద్ధి, కన్నడ భాష సేవలు, తదితర విద్యావిషయక వికాసాన్ని గూర్చి మంత్రిగారితో ఇష్టాగోష్టి చర్చ జరిపారు. ద్రావిడ భాషల అభివృద్ధికొరకు మరియు ప్రత్యేకంగా కన్నడభాష నుండి ఇతర ద్రావిడ భాషలకు ప్రాచీన సాహిత్యాన్ని మరియు సామాజిక, రాజకీయశాస్త్ర మరియు న్యాయశాస్ర్తాలకు సంబంధించి పదకోశాలను తయారు చేయడానికి అందుమూలముగా కలిగే ప్రయోజనాలను మంత్రిగారికి వివరించారు. కర్ణాటక ప్రభుత్వానికి ఈ అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపవలసినదిగా మంత్రిగారు ఉపాధ్యక్షులవారిని కోరినారు. ఈ సందర్భంగా వారికి తేనిటి విందును విశ్వవిద్యాలయంవారు ఏర్పాటు చేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని సందర్శించటం తనకు ఎంతో సంతోషంగా ఉందని మరియు విశ్వవిద్యాలయం వారి ప్రతిపాదనలను తామ ప్రభుత్వం తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రిగారు తెలియజేశారు.
డాక్టర్ పి. ఎస్. గణేష్ మూర్తి, పి ఆర్ ఓ, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.

