
చిత్తూరు జిల్లా, పుంగనూరు గరుడ న్యూస్ ప్రతినిధి: పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం, చౌడేపల్లి సింగిల్ విండో అధ్యక్షుడిగా చిట్టి రెడ్డి పల్లికి చెందిన పగడాల హరి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం త్రీ మ్యాన్ కమిటీ ఎంపిక చేసింది పగడాల హరి ప్రసాద్ తో పాటు పాపిశెట్టిపల్లి సుబ్రహ్మణ్యం రాజు వెంగళపల్లి మాజీ సర్పంచ్ వెంకటరమణ లతో కూడిన త్రీ మాన్ కమిటీని నియమించింది ఇందులో భాగంగా పగడాల హరి ప్రసాద్ ను అధ్యక్షునిగా ఎంపిక చేశారు. తనపై ఇంతటి బాధ్యతను అప్పగించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ముఖ్యంగా పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి రుణపడి ఉంటానని రైతు సమస్యల పట్ల స్పందిస్తానని ఈ సందర్భంగా పగడాల హరి ప్రసాద్ అన్నారు..

