
సాలూరు, జూన్ 30,గరుడ న్యూస్ ప్రతినిధి: నాగార్జున
శృంగవరపుకోట లో శనివారం నాడు
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి MLC రఘురాజు , శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ AGM D. రామకృష్ణ ఆధ్వర్యంలో 11,31,558/- రూపాయల చెక్కు ను నామిని అయిన చిప్పాడ రమాదేవి కి అందించారు. చిప్పాడ రమనాజీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో 1లక్ష రూపాయలు పాలసీ గత సంవత్సరం తీసుకున్నారు. పాలసీ తీసుకున్న 13 నెలల కాలంలో అనుకోకుండా మరణించారు. నామిని కి 11లక్షల 33 వేల 558 రూపాయలు కంపెనీ నుంచి అందించారు. MLC రఘురాజు గారు మాట్లాడుతూ ప్రతీ ఒక్క కుటుంబం ఇన్సూరెన్స్ కట్టుకోవడము వలన ఆర్ధిక ఇబ్బందులు ఉండవు. భవిష్యత్తు రోజుల్లో మీ కుటుంబ అవసరాలకు, పిల్లలు చదువుకోవడానికి పలు అవసరాలకు ఉపయోగ పడతాయి. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంత వేగంగా నామిని కు అమౌంట్ అందించి ఆర్థికంగా ఆదుకోవడమైనది. ప్రతీ ఒక్కరూ ముందుగా ఇన్సూరెన్స్ చేయించండి. ఆర్ధికంగా బలపడి కుటుంబాలకు భరోసా గా ఉండమని సూచించారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ…. ప్రతీ కుటుంబం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకొని కుటుంబానికి రక్షణ గా ఉండాలన్నారు. రమనాజీ మా కంపెనీ లో పాలసీ తీసుకున్న 13 నెలల వ్యవధి లో మరణించడం బాధాకరమని ఆ కుటుంబానికి పాలసీ క్లెయిమ్ అమౌంట్ ఇచ్చి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ నుంచి బ్రాంచ్ మేనేజర్ R. రాంబాబు నాయుడు, BDM k. విజయలక్ష్మి, డెవలప్మెంట్ ఆఫీసర్ k. జయశంకర్, మజ్జి గంగరాజు, s o లు p. దేముడు, k. శివుడు , M. వెంకట్రావు, ch. పార్వతి, వేమలి రోహిని, అక్యాన రాధ, బేవర నాగార్జున లు పాల్గొన్నారు.
