గరుడ న్యూస్, సాలూరు
ఎరువుల డీలర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని రైతులు వద్దు అనుకున్న ఎరువులను బలవంతంగా అంటగట్ట రాదని వ్యవసాయ శాఖ అధికారి కే. తిరుపతిరావు అన్నారు స్థానిక కృష్ణ ఎరువుల డిపో లో ఎరువుల పంపిణీ పరిశీలించారు ఈ సందర్భంగా పి కొనవలస రైతు కొట్టాడా సత్యనారాయణ మాట్లాడుతూ ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేటట్లు చూడాలని దుకాణదారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎరువులతో పాటు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని రైతుకు ఇచ్చే ఎరువుల ఉపయోగాలను కూడా రైతుకు తెలియజేయాలని రైతు ఏ పంటకు ఎరువు తీసుకు వెళుతున్నారో కనుక్కొని సరియైన ఎరువులు మాత్రమే రైతుకు అందజేయాలని సూచించారు రికార్డులు పక్కాగా నిర్వహించాలని లేనియెడల చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపారు.