పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు,జూన్ 30, గరుడ న్యూస్:
చదువుల తల్లి సరస్వతి దేవి ఆలయం కి ఆదివారం భక్తులు పోటెత్తారు.
శ్రీ విశ్వవసు నామ సంవత్సరం 2025 జూన్ 29 ఆదివారం సాలూరు శివాలయం రోడ్డు లో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి 7 వ వార్షికోత్సవ మహోత్సవాల అతి వేడుకగా జరిగాయి. జ్ఞాన సరస్వతి దేవికి, విశేష అభిషేకములు కుంకుమ పూజలు అక్షరాభ్యాసాలు నిర్వహించారు.తదుపరి అన్నప్రసాద వితరణ 3 వేల మందికి పైగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని
సాలూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, జ్ఞాన సరస్వతి ఆలయ భక్త బృందం తెలిపారు.




