గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 30
దశాబ్దాల తరబడి ఉన్న భక్తుల దారి సమస్య మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి చొరవతో తీరింది చౌడేపల్లి మండలం చారాల పంచాయతీ జంగాలపల్లికి సమీపంలోని యోగ మల్లేశ్వర స్వామి ఆలయానికి దారి సమస్య ఉంది దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామి ఆలయానికి వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు ఈ మేరకు పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి దృష్టికి చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు దారితోపాటు ఆలయం వద్ద నీటి కోసం బోర్ డ్రిల్లింగ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వివరించారు ఈ మేరకు అధికారులకు పనులు చేపట్టాలని ఆదేశించారు దీంతో దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలు పరిష్కరించబడ్డాయని భక్తులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీధర్ రాజు సుబ్రహ్మణ్యం రాజు భోయకొండ సుబ్బు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు






