గరుడ న్యూస్, సాలూరు
పార్వతిపురం మన్యం జిల్లా, సాలూరు మున్సిపాలిటీ పరిధి లో ఇంజనీరింగ్ కార్మికులు 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. కానీ మా యొక్క సమస్యలపై సమ్మెపై ఇంతవరకు ప్రభుత్వము గాని మున్సిపల్ అధికారులు గానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం గానీ ఇప్పటివరకు స్పందించలేదు… తమ యొక్క డిమాండ్లు పరిష్కరించనంత వరకు సమ్మె కొనసాగిస్తాం. తమ డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి,
ఆప్కాస్ రద్దు చేస్తే పర్మినెంట్ చేయాలి,
స్కిల్డ్ 29 వేల200 రూపాయల సెమీ స్కిల్డ్ 24 వేల 500 రూపాయల వేతనం చెల్లించాలి,
ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి,
15 సంవత్సరాల దాటిన కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి,
వయోపరిమితి 62 ఏళ్ళకి పెంచాలి,
పర్మినెంట్ వర్కర్ లాగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటి చెల్లించాలి అని డిమాండ్ చేశారు.