


పార్వతీపురం, గరుడ న్యూస్ : తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమ కోసం నిరంతరం పాటుపడతారని, మాజీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం శవాలు వెంట వెళ్తారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతిపురం నియోజకవర్గ టిడిపి క్లస్టర్ ఇన్చార్జులు, మండల గ్రామ పార్టీ అధ్యక్షులతో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వానికి 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, చంద్రబాబు ప్రభుత్వం క్షణాల్లో వెయ్యి రూపాయలు పెంచి 67 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తుందని వెల్లడించారు అలాగే అమ్మ ఒడి అంటూ గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్క బిడ్డకు మాత్రమే సాయమందించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15000 చొప్పున తల్లికి వందనం నిధులు ఇస్తోందని తెలిపారు. సంపన్న రాష్ట్రాలైన గుజరాత్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కూడా లేని క్వాంటం వాలి పేరుతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్నారని తెలిపారు. మానవ వనరుల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పినట్లు తమిళనాడు కు చెన్నై కర్ణాటక కు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాదు వంటి నగరాలు ఉండగా ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ఉన్నారని ఎమ్మెల్యే ఉద్ధాటించారు. పాలను చేతగాక ప్రజలను వేధించడమే తెలిసిన గత ప్రభుత్వం గొప్పలు చేసుకుంటుండగా, ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న చంద్రబాబు గురించి ప్రజలకు వివరించడం టిడిపి కార్యకర్తలుగా నాయకులుగా మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క టిడిపి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
