

పార్వతీపురం, గరుడ న్యూస్ : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్య శాఖ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా భాస్కరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత దేశంలో మొట్ట మొదటి సారిగా భారత ప్రభుత్వం వైద్యుల దినోత్సవం 1991 జూలై ఒకటవ తారీఖున ప్రారంభించారు. ప్రముఖ వైద్యులు మరియు పశ్చిమ బెంగాల్ మొదటి ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ఆయన వైద్య రంగానికి చేసిన కృషి ని గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం ఈ జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకొని ఆయనకు నివాళులు అర్పిస్తారు. యాదృచ్చికం ఏమంటే అతను జూలై 1 వ తారీఖు 1882 న జన్మించారు, అదే జూలై 1వ తారీఖు 1962 న మరణించారు. ఈ సందర్భంగా డా భాస్కరరావు మాట్లాడుతూ వైద్యులు అందరూ తమ శాయ శక్తులు కష్టపడి రోగిని కాపాడడానికి కృషి చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డా జగన్మోహన రావు, డా వినోద్,డా రఘుకుమార్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి నగేష్ రెడ్డి, కార్యాలయ పర్యవేక్షకులు కామేశ్వరరావు, ఇతర అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
