
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు పట్టణం బంగారమ్మ కాలనీ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకుంటూ వైద్య సదుపాయాలు పొందుతున్నారు. ప్రతిరోజు సుమారు 30 మంది నుండి 50 మంది వరకు ఓపి కి వస్తూ ఉంటారు. ఇరుకు గదులు దానితోపాటు బిల్డింగ్ శిధిలావస్థకు చేరి ఎప్పుడు పడిపోతుందో తెలియని దుస్థితి గర్భిణుల వైద్య సమయంలో కూడా తొలి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలని గతంలో కొన్ని నెలల డి.ఎం.హెచ్. ఓ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వర్షాకాలం కావడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన అనేక ఇబ్బందులను పడుతున్నట్టు ప్రజలు చెబుతున్నారు. కొత్త బిల్డింగ్ లోకి మారేలా సంబంధిత అధికారులు త్వరగా చర్యలకు ఉపక్రమించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

