గరుడ న్యూస్ ప్రతినిధి: పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పిఎసిఎస్ చైర్మన్ గా పగడాల హరిప్రసాద్ కు ఉత్తర్వులు అందాయి.. తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి వారి నివాసానికి అనుచరులతో వెళ్లి ఈ పదవి వచ్చేందుకు సహకరించినందుకు చల్లా బాబు రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా చౌడేపల్లి మండలం పిఎసిఎస్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం ఆయనను నియమించిన శుభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురైన నాకు తగిన ఫలితం దక్కిందని ఈ పదవి రావడానికి నాకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్య మరియు ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు ప్రత్యేకంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ వర్యులు చల్లా రామచంద్రారెడ్డి ( బాబు )రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు మరియు పారిశ్రామికవేత పతి రాజు, యువ నాయకుడు ప్రదీప్ రాజు,డీలర్ ప్రహ్లానా ద, ముత్యాల హరి, శశిధర్, అమర్నాథ్ రెడ్డి, విద్యాసాగర్,కార్తీక్, నరేష్,ఉమాపతి,మహేష్,వెంకటరమణ,మురళి,హరీష్,సురేష్,మనోహర,రాధా,సుబ్రహ్మణ్యం,తదితరులు పాల్గొన్నారు..