
గరుడ న్యూస్,సాలూరు
అన్నం రాజు వలస, మామిడిపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయధికారి కే. శిరీష పొలం పిలుస్తుంది నిర్వహించడం జరిగింది. రైతులతో మాట్లాడి పలు సూచనలు చేశారు…
ప్రస్తుతం వరి నారుమడులు తయారీ చేసుకోడానికి, వెదజల్లుకోడానికి సరైన సమయం అని తెలిపారు .
**నేరుగా వరి ఎద సాగు చేసే రైతులు విత్తనాలు జల్లిన 48 గంటలలోపు కలుపు నివారణకు
పెండిమిత్తాలిన్ లేదా ప్రిటిలాక్లోర్ అనే కలుపు మందులు సిఫార్సులు మేరకు వినియోగించి కలుపు ని ముందస్తుగా నివారించే ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు…
**నారుమళ్లు వేసే రైతులు నారు మడి బాగా దుక్కి చేసి పశువులు గెత్తం వేసుకొని నీరు నిలబడకుండా ఏర్పాట్లు చేసి ఎకరానికి 5సెంట్లు నారు మడి లో విత్తనాలు జల్లుకోవాలి..
నారు మొలిచిన వారం తరువాత 1.5 కిలో, యూరియా-1.5కిలో, పోటాష్-0.5కిలో రెండు దఫాలు గా వేసుకోవాలని అని సూచించారు…
మొక్కజొన్న పొలాలు పరిశీలించి కత్తెర పురుగు ఉండటం వల్ల ఏమమెక్టిన్ బెంజాయిట్ 80 గ్రాములు లేదా స్పైనో సైడ్ 60 ఎం ఎల్ ఎకరానికి సుడులు లేదా మొవ్వు లోపల ఆకులు పూర్తిగా తడిసినట్లు పిచికారి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ.లు శ్రీను, తిరుపతిరావు, విఏఏ సంధ్యా ,గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.


