ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకొన్న పెద్దిరెడ్డి – రూ:10 వేలు విరాళం అందజేసిన ధాత

Sesha Ratnam
1 Min Read

చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం గరుడ న్యూస్ ప్రతినిధి: గరుడ న

పుంగనూరులో బోన్‌ క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న విద్యార్థి షాహిద్‌ ను మాజీ మంత్రి , ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్థిక సహాయం చేసి ఆదుకొన్న ఘటన మంగళవారం చోసుచేసుకుంది. వివరాలిలాఉన్నాయి… చౌడేపల్లె గడ్డంవారిపల్లె రోడ్డులో గల జగనన్న కాలనీలో నివాసమున్న షాజహాన్‌, నౌహీరాలకుమారుడు షాహిద్‌ ఇటీవల పదోతరగతి 472 మార్కులు సాధించి పాసైయ్యాడు. 2024 డిసెంబర్‌లో ఇంటి వద్ద కబడ్డీ ఆడుతుండగా జారిపడడంతో కుడి చెయ్యికు గాయమైంది. తేలికగా అనుకొన్న అతడికి చేదు అనుభవం ఎదురైంది. నొప్పి అధికంగా కావడంతో పుంగనూరు, మదనపల్లె, తిరుపతి లో వైద్యసేలందించినా ఫలితంలేకపోవడంతో వైద్యుల సూచనల మేరకు బెంగళూరు కొలంభియా ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడి వైధ్యులు పరీక్షలు నిర్వహించి బోన్‌ క్యాన్సర్‌గా నిర్థారించారు. కార్పెటర్‌గా కూలీ పనులు చేస్తున్న తండ్రి సుమారు రూ:2 లక్షలు పైగా ఖర్చుచేశారు. ప్రస్తుతం కీమోథెరఫి చేస్తున్నట్లు తెలిపారు. పేదరికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అతడు వైఎస్సార్‌సీపీ, జిల్లా ఉప్యాధ్యక్షుడు ఎన్‌.దామోదరరాజు దృష్టికి తీసుకెళ్ళారు. మాజీమంత్రి సహకారంతో మంజూరైన రూ:10 వేలు నగదును బాధితుడి తల్లితండ్రులకు అందజేశారు. ఇంకనూ ఆసుపత్రికి అయ్యే ఖర్చును ఎంపీ పివి. మిథున్‌రెడ్డి సహకారంతో పీఎం రిలీఫ్‌ పండ్‌తోపాటు తమ సహకారంతో చేయూతనిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్థిక చేయూతనిచ్చిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దామోదరరాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ అల్తాఫ్‌ ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *