గరుడ న్యూస్ సాలూరు
వైద్యో నారాయణా హరిః అని అంటారు అంటే డాక్టర్ దేవుడితో సమానం...తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులందరికీ శతకోటి వందనాలు… నేషనల్ డాక్టర్స్ డే అనేది 1991 నుండి ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర సమరయోధుడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి ,వర్ధంతి ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్నం ఇవ్వడమే కాకుండా జులై 1న నేషనల్ డాక్టర్స్ డే గా జరుపుకుంటున్నారు. సాలూరులో డాక్టర్స్ డే సందర్భంగా సాలూరు లో జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా లెజెండ్ వి గణేశ్వరరావు, యువ డాక్టర్ హేమానాయక్ కు ఆర్యవైశ్య పెద్దలు ఇండుపూరి నారాయణరావు, కౌన్సిలర్ శ్రీను ఘనంగా సత్కరించారు.