




చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పుదీపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో వారాహి నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారు శ్రీ కిరాత వైష్ణవి గా దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకున్న వారికి ప్రయోగ బాధలు మరియు దుష్ట గ్రహ పీడ నిర్మూలన కలుగును అలాగే ఆలయంలో ఉన్న నాగ భైరవ స్వామికి అష్టమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి ఉదయాన్నే ఆలయ అర్చకురాలు శ్రావణి పంచామృత అభిషేకం చేశారు చౌడేపల్లి పుంగనూరు మదనపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఉభయదారులుగా బిల్లేరుకు చెందిన భార్గవిగా వ్యవహరించారు