
:
గరుడ న్యూస్,పి.కోనవలస
మాదకద్రవ్యాల దుష్ప్రభావాల పట్ల సైబర్ నేరాల వల్ల కలిగే అనర్ధాలు మహిళల రక్షణ పై అవగాహన కల్పించారు. పాచి పెంట మండలం పి. కొనవలసి గ్రామంలో గురువారం ఉదయం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో సంకల్పం కార్యక్రమం ఏర్పాటు చేశారు. శక్తి యాప్, మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించారు. గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని,గంజాయి రవాణా, సేవనం,అధీనం లో ఉంచడం వలన 20 ఏళ్లు వరకు కఠిన శిక్ష పడే అవకాశం ఉందని, జీవితాలు నాశనం చేసుకోకూడదు. సైబర్ నేరాల వల్ల నగదు పోగొట్టుకున్న వారు ‘గోల్డెన్ అవర్’1930కి ఫోన్ చేయడం ద్వారా నగదు బదిలీ కాకుండా నివారించవచ్చని, మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే 1972 కి సమాచారం అందించాలని, ఓటిపి వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలియజేయవద్దని సైబర్ క్రైమ్, సోషల్ మీడియా నేరాలు అంతకు మించి పెరిగాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయిని ఈమధ్య చాక్లెట్ రూపంలో కూడా చేసి అమ్ముతున్నారని, గంజాయి కు బానిసలు కారాదని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి, పార్వతీపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అంకితా సురానా, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.


