


పార్వతీపురం, గరుడ న్యూస్ : పార్వతీపురం పట్టణంలోని ఎస్ఎన్ఎం కాలనీ, కుసుం గుడ్డి వీధిలో 25 లక్షలతో చేపట్టనున్న రోడ్లు, కాలువలు నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గురువారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. టిడిపి నాయకులు, అధికారులతో కలిసి భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం రోడ్లు, కాలువలు, తాగునీరు విద్యుత్తు వంటి మౌలిక వసతులు సమకూర్చడం తన ప్రథమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే రోడ్లు, కాలువలు నిర్మాణంలో నాణ్యత పాటించి త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అప్పగించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆదేశించారు. అనంతరం ప్రజల అభ్యర్థన మేరకు కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలనీలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యేకు ఎస్ఎన్ఎం కాలనీ, కుసుంగుడ్డివీధి సహా ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
