విజయనగరం జిల్లా, బొబ్బిలి, టీడీపీ జాతీయ కార్యదర్శి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన).ఈ సందర్భంగా బొబ్బిలిలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ, రూ4.30 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గాను ప్రతిపాదన సమర్పించడం జరిగింది. మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, పాఠశాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బేబీనాయన కృషిని అభినందిస్తూ, తప్పకుండా ప్రభుత్వం తరపున తమ పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.