
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అల్లందేవ్ చెరువు,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని అల్లందేవిచెర్వు గ్రామంలోని రైతులు పొలాలకు వెళ్లే రోడ్డు అసంపూర్తిగా ఉండడంతో ట్రాక్టర్లు,రైతుకూలీలను తీసుకువచ్చే ఆటోల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు,రైతు కూలీలు సుర్వి రాజుగౌడ్,దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించి గత 3 మూడు సంవత్సరాల క్రితం తన సొంత నిధులతో బ్రిడ్జిని వేయించడం జరిగింది.కానీ ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు అట్టి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో మళ్లీ రైతుల విజ్ఞప్తి మేరకు ఈరోజు రాజు గౌడ్,బ్రిడ్జి మరమ్మతు కార్యక్రమాలను చేయించి మళ్లీ తిరిగి రోడ్డును రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంలో గ్రామ అల్లందేవిచెర్వు గ్రామ రైతులు సుర్విరాజ్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సుర్వి రాజుగౌడ్ మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని,దేశానికి వెన్నెముక రైతన్న అని,రైతులకు సేవ చేసే భాగ్యం తనకు కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సుర్వి రవి గౌడ్,గుండు రవి గౌడ్,గుండు మల్లేశం గౌడ్,సుర్వి కృష్ణ గౌడ్,సుర్వి కిష్టయ్య గౌడ్,అంతటి అంజయ్య గౌడ్,గోధుమ గడ్డ మల్లారెడ్డి,ఏర్పుల రాములు,సుర్వి జంగయ్య గౌడ్,సుర్వి పరమేష్ గౌడ్ సుర్వి నగేష్ గౌడ్ సుర్వి నరేష్ గౌడ్,సుర్వి జంగయ్య గౌడ్,రైతులు, పాల్గొన్నారు

