
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,జులై4,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం పరిశీలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓబిసి మండల అధ్యక్షుడు గణం అంజయ్య.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కచ్చితంగా ఇళ్లను మంజూరు చేస్తుందని రాబోయే కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి పథకాలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ జంగయ్య,మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు బాలగోని గోపాల్,కోడూరి బీరయ్య,కోడూరి గాలయ్య,చేర్కుపల్లి సత్తయ్య,రోమ్ముల సత్తయ్య, తదితరులు,పాల్గొన్నారు.

