

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్:
మామిడి రైతులకు మేం చేసినంత సాయం గతంలో ఎవరైనా ఇచ్చారా..?
శవ రాజకీయాలు చేసే వారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారు.
సిండికేట్ సమస్య కూడా ఉంది.. దానిని సెట్ చేస్తాం.
*మధ్యాహ్నం మామిడి రైతుల సమస్యపై సమీక్ష పెట్టాను.*
*రైతుల ఇబ్బందులను మేం పరిష్కరిస్తాం.. రైతులకూ మాపై నమ్మకం ఉంది.
మామిడి రైతుల గురించి.. వ్యవసాయం, హర్టీకల్చర్ గురించి ఏ మాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా..?
మైక్రో సబ్సిడీలిచ్చారా..?
హంద్రీనీవా పనులను మేమే చేపడుతున్నాం.
ఏడాదిలోనే రూ.3980 కోట్లు ఖర్చు పెడుతున్నాం.


