
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జులై 04
పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో వారాహి దేవి నవరాత్రులలో 9వ రోజున శ్రీ వజ్ర వైష్ణవిగా అమ్మవారు దర్శనమిచ్చారు ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశారు అనంతరం రంగురంగు పూలతో అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరించారు ఈ రోజున అమ్మవారిని దర్శించుకున్న వారికి ఆరోగ్యం,పరాక్రమం, కుండలిని జాగ్ర తం, భూ, గృహ సమస్య పరిష్కారం జరుగును అమ్మవారిని రామసముద్రం పుంగనూరు చౌడేపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలు దర్శనం చేసుకుని ఎంతో ఆనందంగా సౌందర్యలహరి, లలితా సహస్రనామం పారాయణం చేశారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఈరోజు ఉభయదారులుగా పుంగనూరుకు చెందిన శ్రీనివాసులు ధర్మపత్ని యశోద, చౌడేపల్లి కి చెందిన వాసుదే వాసుదేవులు ధర్మపత్ని రమాదేవి, తెల్ల నీళ్లపల్లి చెందిన ఓబుల్ రెడ్డి ధర్మపత్ని మాలతి గా ఉభయ దారులుగా వ్యవహరించారు


