

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆర్. మంజునాథ్: కౌన్సిలర్ ను “ఎవడ్రా నువ్వు” అంటూ సంబోధించిన మున్సిపల్ కమిషనర్. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలు తెలుసు కునేలా 19వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ జిమ్ దాము ఒకహెల్ప్ డెస్క్ ను కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ హెల్ప్ డెస్క్ పై ప్రజల స్పందన తెలుసుకోవడానికి మరుసటి రోజు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన కౌన్సిలర్ బి ఎం దామోదర్ నాయుడు (జిమ్ దాము) అక్కడ హెల్ప్ డెస్క్ లేకపోవడంతో కంగుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ వి శ్రీనివాసరావును వివరణ కోరడానికి వెళ్ళగా ఆయన తన పట్ల దురుసుగా ప్రవర్తించారని దాము ముఖ్యమంత్రి ఫిర్యాదు చేశారు. తానొక ప్రజా ప్రతినిధిగా ఉంటూ గత 28 సంవత్సరాలుగా పార్టీ ఆవిర్భావం నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న ఇలాంటి సంఘటన తనకి ఎప్పుడు ఎదురు కాలేదని కానీ హెల్ప్ డెస్క్ విషయమై మున్సిపల్ కమిషనర్ తనను తులనాడడం బాధ కలిగించిందని మున్సిపల్ కౌన్సిలర్ దామోదర్ సీఎంకు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి తాను హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశానని తెలిపారు. ఆ హెల్ప్ తీసుకుని ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ను తాను ఒక కౌన్సిలర్ గా ఫ్లోర్ లీడర్ హోదాలో అడగగా తనను “ఎవడ్రా నువ్వు బయటికి పో”అంటూ బెదిరించారని ఆ ఫిర్యాదులో జిమ్ దాము పేర్కొన్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేకూర్చాలని ప్రజా ప్రతినిధుల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
