

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ ప్రతినిధి): ఆర్. మంజునాథ్: కుప్పం మున్సిపాలిటీ:-
కుప్పం పట్టణంలో శుక్రవారం నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించారు. పురపాలక సంఘంలో కమిషనర్ శ్రీనివాసరావు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కడ సలహా కమిటీ సభ్యులు డాక్టర్ సురేష్ బాబులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు లబ్దిదారులకు నూతన పింఛన్లు అందజేశారు. పించనుదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్వాంగులు, వ్యాధిగ్రస్ధులకు ప్రభుత్వం పింఛన్లను పెద్దమొత్తంలో పెంచి అండగా నిలిచిందని లబ్దిదారులకు వారు వివరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాకీర్ మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్.టి.ఆర్. హయాంలో రూ. 35 తో మొదలైన పింఛన్లు ఈ రోజున 4 వేల రూపాయలకు చేరిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శం అన్నారు. అన్ని కేటగిరీల పెన్షన్లు పెంచింది కూటమి ప్రభుత్వం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పింఛన్ లభ్డిదారులకు ఒకటో తేదీన వారి ఇళ్ళకు వెళ్లి ఇవ్వటం జరుగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పుర పాలక సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.
