
అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, అంకి శెట్టిపల్లి పంచాయతీలోని బుద్ధుని కొండలో బుద్ధుని విగ్రహం ధ్వంసం చేసిన ఉన్మాదులను శిక్షించాలని అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల కుంట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పీలేరు బాస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుద్ధుని విగ్రహంపై పలుమార్లు దాడులు జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులకు పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించకపోవడం వల్ల పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నారు. బుద్ధిష్టు సంఘాలన్నీ ఏకమై రాష్ట్ర స్థాయి సమస్యగా మారకముందే పోలీసులు ఈ చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాస్ నాయకులు నాగరాజా, రవీంద్ర, హరినాధ, గురవయ్య, ఆటో యూనియన్ నాయకులు రామచంద్ర, హరి ప్రసాద్, షేక్ సలీం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
