మైనార్టీల సంక్షేమానికి కృషి

K.Muniraja Sharma
1 Min Read

మైనార్టీల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తానని పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. పులిచెర్ల మం inడలం కల్లూరు మైనారిటీ మత పెద్దలు శుక్రవారం చల్లా రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్లూరు దిగువ వీధిలో ఉన్న ఆయేషా మసీద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మసీదు అభివృద్ధికి చల్ల బాబు సానుకూలంగా స్పందించినట్లు మత పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షూకూర్, సయ్యద్ బాషా, కలాం సాహెబ్, ఖాదర్ వలీ, అబ్బాస్, అల్తాఫ్, రహంతుల్లా, మహబూబ్ బాషా, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *