
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,జులై05,(గరుడ న్యూస్):
చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన గుత్తా వెంకటరామిరెడ్డి,ని ఐఎన్టిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచంద్రం,మర్యాదపూర్వకంగా కలిసి,శుభాకాంక్షలు తెలిపి శాల్వలతో సత్కరించారు.అదేవిధంగా చిరు వ్యాపారుల సమస్యలు పెయింటర్ యూనియన్ వారి సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి బ్లాక్ అధ్యక్షులు కంచర్ల జంగయ్య,ఐఎన్టి యుసి చౌటుప్పల్ మండల అధ్యక్షులు చామట్ల శ్రీనివాస్,ఐఎన్టియుసి చౌటుప్పల్,మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ చాంద్ పాషా,ఐఎన్టియుసి చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్,పెయింటర్ యూనియన్ చౌటుప్పల్ మండల డివిజన్ అధ్యక్షులు బండమీది ఎల్లయ్య,చౌటుప్పల్ చిరు వ్యాపారులు అధ్యక్షులు బోదుల
యాదగిరి ప్రభాకర్,తదితరులు, పాల్గొన్నారు.

