

తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ ప్రతినిధి హరికృష్ణ: తిరుపతి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో మేకలు, గొర్రెలను దొంగిలించే ఐదు మంది దొంగలను శనివారం అరెస్ట్ చేసినట్లు చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్, సిఐ సునీల్ కుమార్ తెలిపారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏనుగుదాటి మణికంఠ, చెల్లా చందు, అవిలాల జయకృష్ణ, వక్కలనవీన్ కుమార్, నెన్నురు నితిన్ అనే ఐదుగురు ముఠాగా ఏర్పడి రాత్రిపూట ఇంటి బయట కట్టేసి ఉంచిన మేకలు, గొర్రెలను దొంగిలించి కారులో తీసుకుని వెళుతుండగా మంగళం ఎస్వీసీఈ కళాశాల వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.6.72 లక్షలు విలువైన 45 మేకలు, గొర్రెలను, రెండు మోటార్ సైకిళ్ళు, కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, జగన్నాథ్ రెడ్డి, రైటర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.




