

రాజనాల బండ పై ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు
చిత్తూరు ఏక్స్ ప్రెస్
చౌడేపల్లి జూలై 05
సత్య ప్రమాణాలకు పేరుగాంచిన రాజనాల బండపై వెలసి ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు రాష్ట్రం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సత్య ప్రమాణాల కోసం పలువురు తరలి వచ్చారు కొందరు ప్రమాణాలు చేయగా మరికొందరు వాయిదా వేసుకుని వెళ్లారు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రసన్న ఆంజనేయస్వామి లకు విశేషాభిషేకము అలంకరణ గావించారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల ఆధ్వర్యంలో పవిత్ర తీర్థప్రసాదాలు అందించారు