తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ ప్రతినిధి S. రాజేష్: నల్లజెండాలు చేతబట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేఖిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు. అక్రమ కేసులతో తమ నాయకుడు చెవిరెడ్డిని, ఆయన బిడ్డ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను వేదింపులకు గురిచేయడం దుర్మార్గం. అక్రమ అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరని సూచించిన స్థానిక పార్టీ నేతలు. కూటమి ప్రభుత్వం కుట్రలతో చెవిరెడ్డి కుటుంబాన్ని జైలు పాలు చేయాలని చూస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో భయానక వాతావరణం కలిగించాలనే ఇంతకు తెగించారు. జగనన్న సైనికులను భయపెట్టాలని చూస్తే భయపడే వారు ఎవ్వరు లేరంటున్న నేతలు. చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై చంద్రగిరి ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారని, ఆ కన్నీటిలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కనపెట్టి కక్షసాధింపులకు పాల్పడుతోందని విమర్శ. పోలీసులు సైతం తప్పులు మీద తప్పులు చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగంను అమలు చేస్తున్నారే తప్ప ప్రజాస్వామ్యంను కాపాడటం లేదని వ్యాఖ్య. ప్రజల్లో తిరుగుబాటు మొదలై కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరిక. చెవిరెడ్డి బయటకు వచ్చేంత వరకు పోరాటం ఆగదని, ఆయన చేసిన మంచిని ప్రజలు అందరూ గుర్తుచేసుకుంటున్నారని స్పష్టం చేసిన నేతలు. ఎర్రావారిపాళెం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున గుమికూడి ప్రభుత్వ తీరును ఎండగట్టిన పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు.