

ఓటేసిన వాడిని – కాటేసే నైజం అది ఒక్క చంద్రబాబుకి మాత్రమే సాధ్యం – వైసిపి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురశాల కన్నబాబు
పార్వతీపురం మన్యం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం శనివారం జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్తు రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురశాల కన్నబాబు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఎంపీ గుమ్మా తనూజా రాణి, ఎంఎల్సి సభ్యులు పాలవలస విక్రాంత్, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, జిల్లా పార్టీ ప్రతినిదులు, మాజీ చైర్మన్లు పాల్గొన్నారు.
ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో క్యూఆర్ కోడ్ ద్వారా డాక్యుమెంట్ విడుదల చేశారు . ఈ డాక్యుమెంట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్లు గురించి, జగనన్న పథకాలు ఎలా ఎగరగొడుతున్నారు, అలాగే చంద్రబాబు మోసాల వల్ల నష్టం ఎంత అన్నది ప్రజలకి వివరించాలని బొత్స సత్యనారాయణ తెలిపారు.
రీజినల్ కో ఆర్డినేటర్ కూరసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ నాయకులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు చేస్తూ అనే కార్యక్రమం ద్వారా గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేస్తున్న మోసాలను తెలియజేయడమే కాకుండా ఇస్తామన్నా సూపర్ సెక్స్ హామీలను నెరవేర్చకుండా ఎలా ప్రజలను మోసం చేస్తున్నారు అన్న విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఐదు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో జిల్లా స్థాయిలో నేటి సమావేశం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
