
గరుడ న్యూస్,మక్కువ
పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం సివిల్లి పెద్దవలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ జగన్నాథ స్వామి వారి మారు రథయాత్ర ఉత్సవం అత్యంత వైభవంగా జరిగినది. తే తొలి రథయాత్ర సందర్భంగా ఆలయం నుండి గుడించా మండపమునకు శ్రీ స్వామివారిని రథం పై ఊరేగింపుగా తీసుకుని వెళ్లడం జరిగిందని,ఆ రోజు నుండి నేటి వరకు వివిధ అవతారాలతో పూజ అందుకున్న స్వామి వారిని తిరిగి మారు రథయాత్ర ఉత్సవం సందర్భంగా నేటి దినం అనగా జూలై 5 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ జగన్నాథ స్వామిని రధంపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు వివిధ కోలాటముల బృందాలతో భక్తులు జై జై హర్షద్వానాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తులకు శ్రీ స్వామి వారి దర్శనాలు కల్పించడం జరిగినది. వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ కార్య నిర్వహణ అధికారి వి.వి.సూర్యనారాయణ తెలిపారు.

