గరుడ న్యూస్,సాలూరు
పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం కోటవీధి లో జూన్ 27 నుంచి జూలై 5వ తేదీ వరకు జరిగే జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవ కార్యక్రమానికి వేలాదిమంది భక్తులు జగన్నాథ స్వామిని దర్శించుకుంటున్నారు…
ఈ రథయాత్ర మహోత్సవ కార్యక్రమం వేదపండితుల పూజా కార్యక్రమం ఆర్యవైశ్య మహిళలచే అమ్మవారి పారాయణ కార్యక్రమం మరియు మెంటాడ వీధి, కోటవీధి ఆర్యవైశ్యలచే వంద కేజీల పులిహార భక్తులకు పంపిణీ చేపట్టడం జరిగింది….
ఈ కార్యక్రమంలో ఇండుపూరి శ్రీనివాసరావు దంపతులు , కొల్లిపర రాజేష్ దంపతులు గోకారపు సంతోష్ దంపతులు మెంటాడ వీధి,కోటవీధి ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు.