గరుడ న్యూస్, సాలూరు
సాలూరు టౌన్ బైపాస్ రోడ్ వై జంక్షన్ లో ఇటీవల శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండుగ సమయంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ నెల రోజులు కాకముందే గుర్తుతెలియని వ్యక్తులు లైటింగ్ బోర్డును పగలగొట్టారు. పట్టణానికి స్వాగతం పలుకుతూ ఎంతో అందంగా వి, ప్రజలను ఆకట్టుకున్న ఐ లవ్ సాలూరు బోర్డు ను సంబంధిత అధికారులు ఇటీవల రిపేర్లు చేయించి పాత స్థితికి తీసుకువచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎవరైనా ఆకతాయిలు మద్యం సేవించి మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉన్నందున సీసీ కెమెరాలు పెడితే రక్షణగా ఉంటుందని సాలూరు ప్రజలు కోరుతున్నారు.