

పార్వతీపురం మండలం, కృష్ణపల్లి గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకులు గ్రామ సర్పంచ్ బోను రామీనాయుడు గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం వారి స్వగృహం నందు స్వర్గస్తులైనారు. నాయకుల ద్వారా తెలుసుకున్న స్థానిక మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు గ్రామానికి విచ్చేసి నాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. అనంతరం అంతమ యాత్రలో పాల్గొని మరుబూమి వద్ద జరిగిన సంస్కరణల్లో పాల్గొని తప్తశోక హృదయంతో కడసారి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, సీతానగరం మండల పార్టీ అధ్యక్షులు బోమ్మి రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు కడసారి వీడ్కోలు లో పాల్గొన్నారు.
