సాలూరు జులై 06,గరుడ న్యూస్ ప్రతినిధి-నాగార్జున
సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామంలో రచ్చ బండ వేదిక వద్ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వారి సహకారంతో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ (SST) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, సాలూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం నేతృత్వంలో ద్వారా శనివారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు..
కళాజాత బృందం ఈ సదస్సులో పాల్గొని నాటకాల ప్రదర్శన ద్వారా, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు...
ఈ సందర్భంగా సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ,
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని,
ఆడపిల్లల సంరక్షణ కొరకు మరియు భవిష్యత్తు అవసరాల నిమిత్తం సుకన్య సమృద్ధి యోజన పథకం, అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు..
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద బ్యాంక్ ఎకౌంటు లేని 10 సంవత్సరాలు దాటిన పౌరులందరూ ఉచితంగా బ్యాంక్ అకౌంట్ తెరుచుకోవచ్చని, ఎప్పటికప్పుడు ఆర్థిక లావాదేవీలు జరుపుకుంటూ అకౌంట్ యాక్టివ్ లో ఉంచుకోవాలని సూచించారు..
బ్యాంక్ అధికారులు మరియు ఆర్బిఐ అధికారులు అని ఫోను ద్వారా సంప్రదించి మీ వ్యక్తిగత వివరాలు, ఆధార వివరాలు బ్యాంకు ఖాతా వివరాలను మరియు ఓటీపీలను అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయరాదని సూచించారు..
మీ ఆన్లైన్ ఖాతాలను రక్షించుకునేందుకు బలమైన ప్రత్యేక పాస్వర్డ్ ని ఉపయోగించి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని తెలిపారు..
కళాజాత బృందం పాల్గొని..
ఎస్.ఎస్.టి, ఆర్.బి.ఐ, సైబర్ మోసాల పట్ల గీతాలాపనతో ప్రారంభించి, చీటీ పాటల వల్ల మోసాలను, ఆర్బిఐ గుర్తింపు పొందిన బ్యాంకులలో డబ్బులు డిపాజిట్ చేసుకొని సేవ్ చేసుకుంటే కలిగే లాభాలను, కళ్ళకు కట్టినట్లు పలు నాటికల ప్రదర్శన ద్వారా తెలియజేశారు.. బ్యాంకు అధికారులమని వ్యక్తిగత వివరాలను తెలియజేయమని తెలిపే నాటికకు అక్కడ హాజరైన ప్రజల నుండి విశేష స్పందన లభించింది.. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది వరకు హాజరయ్యారు..
ఈ ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు కార్యక్రమంలో సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు శ్రావణ్ కుమార్, భవాని శంకర్, ముఖేష్( ) లతో పాటు, శంకరయ్య కళాజాత బృందం, కూర్మరాజుపేట వివోఏ రేవతి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు...
