
గరుడ ప్రతి నిధి
చౌడేపల్లి జూలై 06
ఈనెల 9న బంగారుపాలెంలో నిర్వహించే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేద్దామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నడింపల్లి దామోదర్ రాజు పిలుపునిచ్చారు ఈ మేరకు స్థానిక వెంకటరమణ భవనంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి అధ్యక్షతన మండల స్థాయి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించేందుకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేసేందుకు అందరూ సన్నద్ధం కావాలన్నారు రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం మండలంలోని 19 పంచాయితీలకు సంబంధించిన నాయకులతో సభ విజయవంతం కోసం చర్చించారు ఈ కార్యక్రమంలో ఇంకా మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి సర్పంచులు శ్రీరాం భరత్ వరుణ్ కృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ మండల పార్టీ కార్యదర్శి టానాదర్ నాగరాజా ఎంపీటీసీ సభ్యుడు తొండ శ్రీరాములు నాయకులు పద్మనాభ రెడ్డి రవిచంద్ర రెడ్డి రాంబాణం శ్రీనివాసులు రంగన్న సుబ్రహ్మణ్యం మండలంలోని వైకాపా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
