గరుడ న్యూస్,సాలూరు
కెనరా బ్యాంకు ఫౌండేషన్ డే సందర్భంగా చీఫ్ మేనేజర్ అనిల్ కుమార్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సాలూరు లో పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు కె. వీ. సత్యనారాయణ మాష్టారు ఆధ్వర్యం లో పాఠశాల ప్రాంగణం లో మొక్కలు బ్యాంకు సిబ్బంది తో పాటు నాటించటమే కాకుండా విద్యార్థులతో కలిసి నాటించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి ఉపాధ్యాయులు సత్యనారాయణ మాష్టారు మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ లో భూమి వేడెక్కుట తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణం లో ఆక్సిజన్ శాతం పెరిగి భూ కాలుష్యం తగ్గుతుందని అందుకే ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని భూమి వాతావరణం కాపాడుకోవాలని అందరి బాధ్యత అని విద్యార్థులు ను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు.కార్యక్రమం లో సహ ఉపాధ్యాయులు అరుణ, రమణమ్మ, శిరీష పాల్గొన్నారు.




